Saturday, November 23, 2024

Big Breaking: పెళ్లింట విషాదం.. పెళ్లి కూతురు ఆత్మహత్య, మాజీ ప్రేమికుడి ఘాతుకం!

మాజీ ప్రేమికుడి విపరీత చర్యతో ఓ పెళ్లి కూతురు ఆత్మహత్యకు చేసుకుంది. బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాల్సిన ఆ యువతి జీవితం మధ్యలోనే నాశనం అయ్యింది. ఇదంతా మాజీ ప్రేమికుడి కిరాతక చర్యతో జరిగింది. చాలా రోజులుగా వేధిస్తూ, వెంటపడుతున్న వ్యక్తి తనతో పెళ్లి చేసుకోకుంఆ వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుంటుందని తెలిసి ఇంతకు తెగించాడు. ఆ యువతితో గతంలో దిగిన ఫొటోలను పెళ్లికొడుకు పంపడంతో ఈ దారుణం జరిగింది.. మనస్తాపంతో పెళ్లికూతురు ఆత్మహత్య చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరులో పెళ్లికి కొన్ని గంటల ముందే పెళ్లి కూతురు సూసైడ్​ చేసుకున్న ఘటన జరిగింది. ద్వారకాతిరుమల మండలం జాజులకుంటలో ఈ ఘటన చోటుచేసుకుంది. యువతి వివాహానికి గ్రాండ్​గా ఏర్పాట్లు చేశారు తల్లిదండ్రులు. అంతలోనే ఈ దారుణం జరగడంతో పెళ్లింట విషాదం అలుముకుంది. పెళ్లికి వచ్చిన వారంతా శోక సంద్రంలో మునిగిపోయారు. ఆ యువతితో గతంలో దిగిన ఫొటోలను పెళ్లి కుమారుడికి సెండ్​ చేశాడు మాజీ ప్రేమికుడు. దీంతో తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుని ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement