చింతూరు, ప్రభ న్యూస్: వరదల చివరి సమయంలో చింతూరులో మంగళవారం చెరువులో స్నానాలకి వెళ్లి మృతి చెందిన పెను విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కుమ్మూరు గ్రామ పంచాయితీ అదే గ్రామానికి చెందిన కురసం సత్యం – నాగమణి దంపతుల కుమార్తె కురసం దుర్గా భవాని (8) చెరువులో స్నానానికి వెళ్లి మృత్యువాత పడింది. ఈ చిన్నారితో పాటు- మరో చిన్నారి కూడా అదే చెరువులో మృతి చెందింది.చింతూరు ఎస్టీ కాలనీకి చెందిన ఎర్రమళ్ల రాంబాబు – కళ్యాణి దంపతుల కుమార్తె అక్షిత (8) సైతం మృతి చెందిన విషాదకర చోటు చేసుకుంది. దుర్గా భవాని తల్లీ స్థానిక ఏపీఆర్లో వంట కుక్ గా పనిచేస్తుంది.
వరదల నేపథ్యంలో కుమ్మూరు గ్రామం నుండి ఎర్రంపేట గ్రామంలోని ఒక ఇంట్లో ఉంటున్నారు. అలాగే అక్షిత కుటుంబం వరద ముంపునకు గురి కావడంతో వారు తలదాచుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు- చేసిన పునరావాస కేంద్రంలో ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఇద్దరు పిల్లలు సాయంత్రం సమయంలో మండల విద్యాశాఖ కార్యాలయం వెనుక ఉన్న చెరువులో స్నానాలు చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందారు. చెరువుకు వెళ్లిన ఇద్దరూ ఎంతసేపటకి రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూడగా వారు విగత జీవులుగా ఉన్నారు. మన్యంలో వరదల నేపథ్యంలో ఇప్పటి వరకు ఎటు-వంటి అవాంచనీయ ఘటనలు చోటు- చేసుకోకుండగా ఈ ఘటనతో విషాధచాయలు అలముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.