Tuesday, November 12, 2024

AP | వన్యప్రాణుల అక్రమ రవాణా… ముగ్గురు అరెస్టు

పలాస, నవంబర్ 12 (ఆంధ్రప్రభ) : ఒడిశా రాష్ట్రం నుంచి కర్నాటక రాష్ట్రానికి ఆఫ్రికన్‌ జాతికి చెందిన 21 వన్యప్రాణులను కారులో అక్రమంగా తరలిస్తుండగా ఇచ్చాపురం వద్ద సోమవారం రాత్రి పట్టుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పలాస అటవీశాఖ రేంజర్‌ ఎ.ఎం.కె.నాయుడు తెలిపారు.

మంగళవారం అటవీ అధికారి మాట్లాడుతూ… ఆఫ్రికన్‌ జాతికి చెందిన 17 కొండచిలువ పిల్లలు, ఆఫ్రికన్‌ జాతికి చెందిన పెద్ద తాబేలు ఒకటి, చిన్న తాబేళ్లు రెండు, అదే జాతికి చెందిన అడవి పిల్లిని మొత్తం 21 వన్యప్రాణులను సయ్యద్‌ ముయాకాత్‌ల్లా, విజయకుమార్‌, ముజాహిత్‌ అహ్మద్‌ ఖాన్లు కారులో ఒడిశా నుంచి కర్నాటకకు అక్రమంగా తరలిస్తుండగా అటవీ అధికారులు రోజువారి తనిఖీల్లో భాగంగా వీరు ఇచ్చాపురం వద్ద పట్టుబడ్డడం జరిగిందన్నారు. వీరిపై వన్యప్రాణులు అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను ఇచ్ఛాపురం కోర్డులో హాజరు పరుస్తున్నామని, వన్యప్రాణులను విశాఖ జూకు తరలించడం జరుగుతుందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement