సింహాచలం… నవంబరుసింహగిరిపై ట్రాఫిక్ పోలీస్ అవుట్ పోస్టు ప్రారంభం 9. సింహగిరిపై గురువారం ఏకాదశి పర్వదినం సందర్భంగా పోలీస్ విభాగం ఏర్పాటు చేసిన నూతన ట్రాఫిక్ ఔట్ పోస్ట్ ను అప్పన్న ఆలయ ఈవో ఎస్ శ్రీనివాస్ మూర్తి ,ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీను బాబు, దినేష్ రాజు, ఎస్ .శ్రీదేవి ఎం రాజేశ్వరి, ట్రాఫిక్ సిఐ అశోక్ కుమార్ ఇతర అధికారుల సంయుక్తంగా ప్రారంభించారు. తొలుత అవుట్ పోస్ట్ కు ఈవో ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ ట్రాఫిక్ ఔట్ పోస్ట్ వల్ల సింహగిరి పై ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఉపయోగ పడుతుంది అన్నారు.ఇక త్వరలోనే పూర్తి స్థాయీ లో పోలీస్ అవుట్ పోస్టు కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇందుకు సంబంధించి పోలీసు ఉన్నతాధికారులతో ఇప్పటికే మాట్లాడటం జరిగింది అన్నారు. త్వరలోనే ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి స్థల పరిశీలన జరిపి ఇందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు
.నూతన వాహనానికి పూజలు
సింహాచలం దేవస్థానానికి సంబందించి తాజాగా రూ .28 లక్షలతో నూతన వాహనం కొనుగోలు చేశారు.. ప్రస్తుతం ఈవో వినియోగిస్తున్న కారు పాతది కావడంతో దాని స్థానంలో నూతన వాహనం కొనుగోలుకు ఇటీవల ధర్మకర్తల మండలి అనుమతి ఇచ్చింది. దీంతో నూతన వాహనం కొనుగోలు చేసి గురువారం ఈవో, ధర్మకర్తల మండలి సభ్యులు ప్రత్యేక పూజలు జరిపారు. సభ్యులు గంట్ల శ్రీను బాబు, శ్రీదేవి, ఏఈఒ బ్రమరంబ అధికారులు పూజలు నిర్వహించారు.
.సింహగిరి వ్యాపారులకు సంపూర్ణ సహకారం
సింహగిరిపై ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు నిర్వహించుకుంటున్న వర్తకులకు దేవస్థానం తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని ఆలయ ఈవో ఎస్ శ్రీనివాస్ మూర్తి,ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబులు తెలిపారు. వర్తకులకు తాజాగా ఏర్పాటు చేయనున్న తాత్కాలిక దుకాణ సముదాయాల ప్రాంతాన్ని ధర్మకర్తల మండలి సభ్యులు ఈఓ శ్రీనివాస మూర్తి కలిసి పరిశీలించారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాటు చేసిన మాదిరిగా కాకుండా వలయాకారంలో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేయాలని వర్తకులు వీరిని కోరారు. ఐతే వారు కోరిన విధంగానే ఏర్పాటు చేయాలని ఈవో,ధర్మకర్తల మండలి సభ్యులు అధికారులు కు సూచించారు. నూతన దుకాణాల నిర్మాణం లో కూడా వర్తకులు సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని ముందుకు సాగాలని గంట్ల శ్రీను బాబు కోరారు.సింహగిరి గ్రామం తరలింపు విషయం లో ప్రజలు ఎంతగానో సహకారం అందించిన విషయం పరిగణలోకి తీసుకోవాలని శ్రీను బాబు చెప్పారు.ఎం. రాజేశ్వరి, వర్తకులు, ఇఇ శ్రీనివాస రాజు, డిఈ హరి, సిరిపురపు కనక రాజు, సునీల్, పి అర్ ఓ నాయుడు తదితరులు పాల్గొన్నారు.