Wednesday, November 6, 2024

AP | గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలి… ఎస్పీ అమిత్ బర్దర్

ఏఎస్ఆర్ జిల్లా ప్రతినిధి (ఆంధ్రప్రభ ) : గంజాయి ర‌వాణాకు అడ్డుక‌ట్ట వేయాల‌ని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో ఉన్న వీఆర్ ఫంక్షన్ హాలులో జిల్లా ఎస్.పి అమిత్ బర్దర్ ఆద్వర్యంలో పాడేరు, హుకుంపేట, డుంబ్రిగూడ, అరకు, అనంతగిరి, పెద్దబయలు, ముంచింగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, జి.కె.వీధీ, కొయ్యూరు మంప మండలాలకు చెందిన 110 మంది గ్రామీణ మహిళా సంరక్షణ కార్యాదర్సిలతో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలన్నారు. గంజాయి రవాణా జరగకుండా చేయుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గంజాయి వల్ల జిల్లాకు చెడ్డ పేరు వస్తుందన్నారు. గంజాయి రవాణా చేస్తున్న‌ వారు జైలు పాలవుతున్నారు. దీని వల్ల వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయ‌ని, గంజాయి వాడడం వల్ల అనారోగ్యానికి గురవుతారని, పుట్టే పిల్లలు వికాలాంగుల గానూ, అనారోగ్యం తోను పుడతారని తెలిపారు. గంజాయి రవాణా, సారాయి తయారుచేసినా లేదా అమ్మినా వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలన్నారు. సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement