Tuesday, November 19, 2024

AP | పాపికొండల విహారయాత్రకు పోటెత్తిన పర్యాటకులు..

దేవీపట్నం, (అల్లూరి జిల్లా) ప్రభ న్యూస్‌: పాపికొండలు విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తారు. భారీగా పర్యాటకులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.. 11 బోట్లలో 690 మంది పర్యాటకులు గోదావరి నదిలో విహారయాత్రకి వెళ్లినట్లు చెప్పారు.. ఒక్కో పర్యాటకుడు వద్ద నుంచి రూ.1250 తీసుకుంటున్నట్లు చెప్పారు… దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మ తల్లి ఆలయం వద్ద పర్యాటక బోట్‌ పాయింట్‌ ఉంది.

ఇక్కడి నుంచి ప్రతిరోజు పాపికొండల విహారయాత్రకు బోట్లు వెళుతూ ఉంటాయి. శని, ఆదివారాల్లో ఎక్కువగా పర్యాటకులు వెళ్తుంటారని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు బయలుదేరిన బోట్లు సాయంత్రం 6 గంటల లోపు తిరిగి వస్తాయని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు అందరికీ అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరికి లైఫ్‌ జాకెట్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఒక్కొక్క పర్యాటకుడి వద్ద నుంచి 1250 రూపాయలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో 250 రూపాయలు రాజమండ్రి నుంచి గండి పోచమ్మ తల్లి ఆలయం వరకు వాహనంలో తీసుకురావడానికి తీసుకుంటారని చెప్పారు. మిగిలిన వెయ్యి రూపాయలు బోర్డ్‌ పాయింట్‌ వద్ద నుంచి పాపికొండలు విహారయాత్ర వరకు వెళ్లి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. పర్యాటకులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారులు దృష్టికి తీసుకురావచ్చు అని సూచించారు. రవాణా విషయంలో, భోజనాలు విషయంలో, ఇంకా ఇతర సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement