Monday, November 18, 2024

Tourism – ఇక కృష్ణా న‌దిలో లాహిరి లాహిరి … నాగార్జున‌సాగ‌ర్ టు శ్రీశైలం టూర్

నేటి నుంచి అందుబాటులోకి..
నాగార్జున‌సాగ‌ర్ టు శ్రీశైలం టూర్
నాగార్జున సాగర్ కు బ‌య‌లుదేరిన లాంచీ
100 మందితో తొలి ప్రయాణం
తెలంగాణ టూరిజం ఆధ్వ‌ర్యంలో టూర్
రెండు ప్యాకేజ్ ల‌తో విహార‌యాత్ర

నాగార్జున‌సాగ‌ర్ -శ్రీశైలం, నాగార్జున సాగర్ చూడాలనుకునే టూరిస్టులకు గుడ్ న్యూస్ .తెలంగాణ ప్రభుత్వం నవంబర్ 2 నుంచి లాంచీ ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చింది. సోమశీల నంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ (క్రూయిజ్ )ను ప్రారంభించింది. నేటి ఉద‌యం సుమారు 100 మంది టూరిస్టులతో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభమయ్యింది. ఇవాళ సాయంత్రానికి శ్రీశైలం చేరుకోనున్న లాంచ్.. దర్శనం అనంతరం రేపు(నవంబర్ 3న) మళ్లీ తిరిగి నాగార్జున సాగర్ కు చేరుకోనుంది. టూరిస్టులు కృష్ణమ్మ ఒడిలో, నల్లమల పచ్చదనం అందాలను వీక్షిస్తూ కృష్ణా నదిలో జలవిహార యాత్ర చేయొచ్చు.

- Advertisement -

కాగా, https://tourism.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించి, పూర్తి వివరాలు తెలుసుకోవాలని టూరిస్టు లకు సూచించారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు, నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు సింగిల్‌ రైడ్‌తో పాటు రౌండప్‌ క్రూయిజ్‌ జర్నీ ధరలను నిర్ణయిం చారు.


ఈ రెండు వేర్వేరు ప్యాకేజీలకు ఒకే రకమైన టికెట్ ధరలే వర్తిస్తాయి. సింగిల్‌ జర్నీలో పెద్దలకు రూ.2000, చిన్నారులకు రూ.1,600, రౌండప్ (రానుపోను) జర్నీలో పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,400 గా ధరను నిర్ణయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement