ఏపీలో వర్షం భీభత్సవం సృష్టించింది. వాతావారణ శాఖ వర్ష సూచన ఉందని ముందుగానే వెల్లంచినట్లుగానే ఈదురుగాలలతోకూడిన భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా కడప జిల్లాలో మధ్యాహ్నాం భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. కుర్చీలు ఎగిరిపడ్డాయి.
వర్షం వల్ల ఎన్నికల అధికారులు సైతం ఇబ్బందులు పడ్డారు. రేపటి ఎన్నికలకు ఆటంకం కలుగుతుందేమోనని ఆందోళన చెందుతున్నారు.
- Advertisement -
మరోవైపు పులివెందులలో కురిసిన వర్షానికి రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. అత్యంత వేగంగా వీచిన ఈదురుగాలులతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఒక్కసారిగా దంచికొట్టిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీటితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.