Friday, November 22, 2024

Toppers – సివిల్స్ లో పాల‌మూరు బిడ్డ అనన్య‌కు మూడో ర్యాంక్

సివిల్స్ లో వ‌రంగల్ జిల్లా నుంచి ఎంపికైన ముగ్గురు
మొత్తంలో 50 మంది తెలుగు అభ్య‌ర్ధులు ఎంపిక

ఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ – 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అనన్య రెడ్డి జాతీయ స్థాయిలో మూడో ర్యాంకుతో మెరిశారు…

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..

- Advertisement -

దోనూరు అనన్య రెడ్డి (3) మూడో ర్యాంకుతో సత్తా చాటగా.. నందల సాయికిరణ్‌ 27, మేరుగు కౌశిక్‌ 82, పెంకీసు ధీరజ్‌రెడ్డి 173, జి.అక్షయ్‌ దీపక్‌ 196, గణేశ్న భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ 198, నిమ్మనపల్లి ప్రదీప్‌ రెడ్డి 382, బన్న వెంకటేశ్‌ 467, కడుమూరి హరిప్రసాద్‌ రాజు 475, పూల ధనుష్‌ 480, కె.శ్రీనివాసులు 526, నెల్లూరు సాయితేజ 558, కిరణ్‌ సాయింపు 568, మర్రిపాటి నాగభరత్‌ 580, పోతుపురెడ్డి భార్గవ్‌ 590, కె.అర్పిత 639, ఐశ్వర్య నెల్లిశ్యామల 649, సాక్షి కుమారి 679, చౌహాన్‌ రాజ్‌కుమార్‌ 703, గాదె శ్వేత 711, వి.ధనుంజయ్‌ కుమార్‌ 810, లక్ష్మీ బానోతు 828, ఆదా సందీప్‌ కుమార్‌ 830, జె. రాహుల్‌ 873, హనిత వేములపాటి 887, కె.శశికాంత్‌ 891, కెసారపు మీన 899, రావూరి సాయి అలేఖ్య 938, గోవద నవ్యశ్రీ 995 ర్యాంకుల్లో మెరిశారు.

వరంగ‌ల్ జిల్లా నుంచి ముగ్గురు

యూపీఎ‍స్సీ ఫలితాల్లో వరంగల్ జిల్లాకు కు చెందిన ముగ్గురు సెలక్ట్‌ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి ర్యాంకులు వచ్చాయి. వరంగల్‌ నగరానికి చెందిన జయసింహారెడ్డికి 103వ ర్యాంకు వచ్చింది. గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్‌కు 568 ర్యాంకు వచ్చింది. శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్‌కు 764వ ర్యాంకు వచ్చింది. జయసింహారెడ్డికి ఐఎఎస్, కిరణ్‌కు ఐపిఎస్, . అనిల్ కుమార్‌కు ఐఆర్ఎస్ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement