Saturday, November 2, 2024

Top Story – వ‌ల‌స‌ల వికృత విన్యాసం …గెలిచెయ్ .. దూకేయ్

పైసలుంటేనే ప్రజాసేవ
పెరిగిన ఓటు ధర

మా డబ్బేనంటూ ఓటర్ల దర్జా వసూళ్లు
విలువల్లేవు.. విశ్వాసాల్లేవు

సిద్ధాంతాలు ఒట్టిదే.. అన్నీ రాద్దాంతాలే
పైసలుంటేనే ప్రజాసేవ

గెలవటం మొదటి మెట్టే… అధికార పార్టీలోనే
ఉండాలి శ్రీ విపక్ష పార్టీలకు విలువేదీ

సాగని పనులు.. దక్కని గౌరవం
సమాజానికీ పట్టని వైనం

సామాజిక, రాజకీయవేత్తల విశ్లేషణలు

ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. నియంతృత్వ ధోరణిలో పోతే తప్ప.. కనుచూపు మేర భవిష్యత్తులో పాలకపక్షాల హవా ఇలాగే నడుస్తుందని సామాజిక, రాజకీయ, ఆర్ధికవేత్తలు అంచనా వేస్తున్నారు.. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల్లో విచ్చలవిడి ధన వ్యయం ఒక కారణం కాగా, పౌర సమాజం కూడా అదంతా మాడబ్బేగా అని ఓట్లకు విలువ కడుతుండడమే మరో కారణంగా చెబుతున్నారు. ఇక వెన్నెముకగా ఉండాల్సిన కార్యనిర్వాహక వ్యవస్థ కూడా మెత్తబడిపోయి రూపురేఖలు ఏనాడో కోల్పోయి, శాసన వ్యవస్థకు దాసోహమైపోవడం మూడో కారణంగా విశ్లేషణలు సాగుతున్నాయి. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల గాఢానుబంధాన్ని గమనిస్తే సామాజిక చైతన్యపరులు కూడా నిశ్చేష్టులై కాలగమనాన్ని నిస్సహాయంగా గమనిస్తూ భరిస్తున్నారని సామాజిక విశ్లేషకులు బాధను వ్యక్తం చేస్తున్నారు… ఈ నేపథ్యంలో అధికార పార్టీలలోకి వలసలు నిరంతరం, నిర్విరామంగా. నిస్సంకోచంగా సాగుతూనే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు…

- Advertisement -

(న్యూస్‌ నెట్‌వర్క్‌ ఇన్‌చార్జ్‌)


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడిదే చర్చ… అధికారపక్షంలోకి వలసలు! ఆయా పార్టీల నుంచి గెలిచిన ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ప్రభుత్వం ఏర్పాటు- చేసిన పార్టీ లేదా పార్టీల కూటమిలోకి పోలో… మని ఎందుకు పోతున్నట్టు-? ఓట్లేసిన జనసామాన్యం నుంచి సమాజంలోని ఆయా వర్గాల్లో మేధావుల్లో కూడా ఇదే ప్రశ్న నేడు వెంటాడుతోంది! సామాజిక, రాజకీయ, ఆర్ధిక విశ్లేషకుల అంచనా ప్రకారం ప్రముఖంగా వినిపిస్తున్నది ఒక్కటే… డబ్బు!! ఓటరు ఓటు- అమ్ముకో వడం నుంచే ఇది మొదలవుతోందని కొందరు స్పష్టం చేస్తుంటే… కాదు, అవినీతికి అలవాటు-పడిన కార్యనిర్వా హక, శాసన వ్యవస్థలే కారణమని మరి కొందరు కుండబద్దలు కొడుతున్నారు! ఇదెలా ఉందంటే గుడ్డు ముందా? కోడి ముందా? అన్నట్టు-ఉందని తలపండిన పరిశీలకులు చెబుతున్నారు! కనీసం దశాబ్దకాలం పాటు- ఇదే క్రీడ కొనసాగు తుందని భావిస్తున్నారు.

ప్రతిపక్షాలు నిలదొక్కుకుని, పాలకపక్షాలతో కలబ డాలంటే క్షేత్రస్థాయిలో పోరాడే కార్య క్రమాలు రూపొందించుకోవాలే తప్ప మరో మార్గమే లేదని చెబుతున్నారు. జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో తలా పాపం తిలా పిడికెడుగా భావించాలే తప్ప ఎవరినీ నిందించే పరిస్థితి కూడా లేదన్నది విశ్లేషకుల భావన. పార్టీలను మారే అభ్యర్ధులనో, చేర్చుకునే పార్టీలనో నిందించి ప్రయోజనం లేదన్నది వారి వాదన. పౌర సమాజంలోనూ సరిదిద్ద లేని పొరపాట్లు- కూడా కీలకమేనని వారం టు-న్నారు. ఏది ముందు మొదలైందన్న సంగతిని పక్కనబెడితే… ఒకదానికొకటి ముడిపడి ఉందన్న విషయం మాత్రం స్పష్టం. కనీసం వంద కోట్ల వ్యయానికి సిద్ధపడకపోతే ఆయా నేతలకు తమ సొంత పార్టీలే టిక్కెట్లివ్వని పరిస్థితి! సరే! వందకోట్లు- వెదజల్లడానికి సిద్ధపడి, ఓట్లకోసం వెదజల్లి గెలిచారనుకుందాం. మరి ఆ తర్వాత ఏం చేయాలి? ఆ వందకు మరో పది వందల కోట్లను సంపాదించాలనుకోవడమే కదా బిజి నెస్‌?! అలాకాకుండా వంద కోట్లు- ఓట్లకు ధారపోసి ఇంకా జన సేవ, సమాజ సేవ అని ఎవరైనా తిరుగు తారా? ఓట్లేసిన వాళ్లే అనుకోవడం లేదు! మరి ఇటు-వంటి ప్రజాప్రతినిధులు… సారీ, వేలం వెర్రిగా ఓట్లను కొనుక్కున్న ప్రతినిధులకు కార్య నిర్వాహక వ్యవస్థలోని సేవారత్నలు కూడా సహకరిస్తారు కదా! ఒకవేళ కారణం ఏదైనాకాని, ముడుచుకుపోతే శంకరగిరిమా న్యాలే!

ఇది కింది నుంచి పైదాకా అందరికీ చాలా చాలా స్పష్టంగా తెలిసిందే. నువ్వు సహకరించు… నేను బహూకరించు కుంటా అంటూ ఈ రెండు వ్యవస్థలూ ఒకదానికొకటి పెనవేసుకుని పోయాయ న్నది సర్వామోద అంశం! వీళ్లది విడదీ యలేని, విడదీయరాని బంధంగా మారి పోయింది. ఇంతటి మహత్తర, మహోన్నత బంధాన్ని గమనించిన సామాన్య ఓటర్లు ఊరుకుంటారా? మా డబ్బేగా అని రేటు- పెంచేస్తున్నారు… పంచితేనే ఎన్నుకుం టు-న్నారు! ఇక ఎక్కడో గ్రంథాల్లో కనిపించే నైతిక విలువల పేరుతో పార్టీకి, సిద్ధాంతాలకు, విశ్వాసాలకు కట్టు-బడి ఉందామనుకుంటే… రాజకీయాల్లో కనుమరుగే!

మళ్లి ఎన్నికలు ముంచు కొస్తాయి… మరో వందకోట్లు- ఎక్కడి నుంచి వస్తాయి? ఇక అధికార పార్టీలో లేకపోతే చివరకు గ్రామ పంచాయతీ కార్యదర్శికి కూడా ఎమ్మెల్యే మాటే వినిపించదు! పనులు చేయకపోవడం సరే… అసలు ఫోను ఎత్తడమే గగనం! విపక్షాల్లో ఉండే ప్రజాప్రతినిధులకు దక్కుతున్న గౌరవం ఇది. ప్రభుత్వాల పనితీరు వల్లే కార్యనిర్వాహక వ్యవస్థ తప్పనిసరి పరిస్థితుల్లో అనుకూలంగా మారిపోతోంది… అంతేనా తానా అంటే తందానా అంటోంది! విపక్షాల నుంచి గెలిచినా పేరు-కై-నా ప్రజాసేవ చేయలేని దుస్థితి. అధికార పార్టీలో చేరక తప్పని పరిస్థితి! ఈ నేపథ్యంలో కేడర్‌ నుంచి కూడా తీవ్ర ఒత్తిళ్లు ఎదురవుతు న్నాయి. ఊపిరి సలపని నేపథ్యంలోనే వలసలు సాధారణ కార్యక్రమంగా నేడు మారిపోయిందని సామాజికవేత్తలు నిట్టూరుస్తున్నారు!

Advertisement

తాజా వార్తలు

Advertisement