ఏపీ, తెలంగాణ రాష్ర్టాల విద్యార్థులకు ప్రభుత్వాలు శుభవార్త అందించాయి. హిందువుల తొలి ఏకాదశి, ముస్లింల మొహర్రం సందర్భంగా రేపు (బుధవారం) సెలవు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఆషాఢమాసం శుక్లపక్ష ఏకాదశి.. తొలి ఏకాదశి పండుగ.. హిందువులకు ఎంతో ప్రీతికరమైన రోజు.. పైగా హిందువులకు తొలి పండుగ ఈ రోజునే జరుపుకుంటారు. ఈరోజు భక్తులు దేవాలయాలకు వెళ్లి విష్ణుమూర్తిని పూజిస్తారు. ఉపవాసం ఆచరించి భక్తిశ్రద్ధలతో భగవాన్మమస్మరణ చేస్తారు.
అలాగే, మోహరం ఇస్లామిక్ క్యాలెండర్లో ఇది మొదటి నెల. ఈ మాసంలో ముస్లింలు సంతాపం తెలుపుతారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హుసేన్ ఇబ్న్ అలీ బంధువులతో కలిసి అమరుడైన రోజని ముస్లిం పెద్దలు చెబుతారు.