Saturday, November 23, 2024

Tomota News | ఏపీలో 50 రూపాయలకే కిలో టమాట.. 103 మార్కెట్లలో అందుబాటులోకి

టమాటా ధరల పోటు నుంచి ప్రజలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రైతు బజార్లలో కేవలం 50 రూపాయలకు కిలో టమాటాలను అమ్మే విధంగా చూస్తోంది. ఏపీలోని 103 రైతు బజార్లలో కిలో 50 రూపాయలకే విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం ఇవ్వాల (శనివారం) తెలిపింది.  సాధారణ మార్కెట్​లో కిలో టమాటాలు 100 రూపాయలకు చేరడంతో జనం గగ్గోలు పెడుతున్నారు.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

వినియోగదారులకు రిలీఫ్​ కలిగించేందుకు ఏపీ వ్యాప్తంగా ఉన్న 103 రైతు బజార్లలో టమాటాలను కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం తెలిపింది. టమోటా ధరల పెరుగుదలకు ప్రతిస్పందనగా ప్రభుత్వం అందరికీ అవసరమైన కూరగాయలను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా తక్కువ ధరకు అందివ్వడానికి తగిన చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. సాధారణ మార్కెట్​లో కిలో టమాటాల ధర రూ.100కి చేరుకోవడంతో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 103 రైతు బజార్లలో కిలో రూ.50కి విక్రయాలను ప్రారంభించింది. కాగా, ప్రజలకు టమాటా సరసమైన ధరలకు లభించేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ మార్కెటింగ్​ శాఖను ఆదేశించారు.

- Advertisement -

ప్రజల డిమాండ్లను తీర్చడానికి ఈ అవసరమైన కూరగాయలను స్థిరంగా, సరఫరా చేసేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోజూ 50 టన్నుల టమోటాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రోజూ రైతు భరోసా కేంద్రం (RBK) వద్ద CMAPP (వ్యవసాయ ధరలు, సేకరణ యొక్క నిరంతర పర్యవేక్షణ) ద్వారా అన్ని వ్యవసాయ వస్తువుల ధరలను పర్యవేక్షిస్తుంది. ధరలు తక్కువగా ఉన్నప్పుడల్లా రైతుల నుంచి ఎమ్‌ఎస్‌పిపై సరుకులు కొనుగోలు చేసేందుకు జోక్యం చేసుకునే ఉత్తర్వులు జారీ చేస్తారు.

రైతులకు కనీస మద్దతు ధర లభించడానికి , మార్కెట్ స్థిరీకరణకు సకాలంలో జోక్యం చేసుకుంటుంది. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా 103 రైతు బజార్ కేంద్రం రైతులకు, వినియోగదారులకు కూరగాయలకు మంచి ధరలను అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న టమాటా ధరల ప్రభావం ప్రజలపై పడుతుందని గుర్తించిన ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారు 100 టన్నుల టమోటాలను సేకరించింది. ఈ టొమాటోలు వివిధ రైతు బజార్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు, వినియోగదారులకు వీటిని సబ్సిడీ ధరలకు అందుబాటులో ఉండేలా చూస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మార్కెట్ ధరలు స్థిరంగా ఉండే వరకు సేకరణ ప్రయత్నాలను కొనసాగించాలని డిపార్ట్ మెంట్ యోచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement