మేలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన వారు నమోదు చేసుకోవడానికి ఇవాళే ఆఖరి రోజు. ఓటర్ల జాబితాలో పేరు లేకుంటే వెంటనే ఓటు హక్కు పొందడానికి ఈ రోజు మాత్రమే ప్రయత్నించాలని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.
నేటి వరకే ఎన్నికల సంఘం ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశమిచ్చింది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్… మే 13వ తేదన జరగనున్న ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఈరోజు ఓటు హక్కు ఉన్నదో? లేనిదో? సరిచూసుకుని దానిని ఆన్ లైన్ లో నైనా అప్పలయి చేసుకోవచ్చు. తుదిజాబితాకు అనుబంధంగా ఓటర్ల జాబితాను ప్రచురించాల్సి ఉన్నందున ఈరోజు ఓటు హక్కు నమోదుకు ఆఖరి రోజుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. నేరుగా బూత్ స్థాయి అధికారుల వద్దకు వెళ్లి ఫారం 6 ద్వారా కూడా ఓటు హక్కు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు.