తిరుమల, ఆంధ్రప్రభ ప్రతినిధి : ప్రభుత్వం మారిన ఎనిమిది నెలల్లో టీటీడీ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై నేడు మొదటి సమావేశమయ్యే పాలకమండలి చర్చించనున్నది. ప్రధానంగా ఎనిమిది నెలలుగా శ్రీవారికి కావలసిన నైవేద్యాలు ముడి సరుకులు కొనుగోలు, టీటీడీలో అన్యమతస్తుల పై చర్చకు రానుందని సమాచారం.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు తిరుమల కొండ పై ఎటువంటి రాజకీయ నాయకుల వ్యాఖ్యల పై, టిటిడి పై దుష్ప్రచారం చేసే సోషల్ మీడియా పై చర్చకు రానున్నాయి. ఇక శ్రీనివాససేతు పేరుతో గత ప్రభుత్వం నామకరణం చేయగా గతంలో ఉన్న గరుడవారథి పేరునే కొనసాగించాలని ఆప్కాన్ సంస్థ ప్రతినిధులు కోరగా గరుడవారథిని కొనసాగించాలని చైర్మెన్ బిఆర్.నాయుడు తెలిపారు.