ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్, గురుగ్రహం, నైప్యూటర్, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది. ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం బ్లూ మూన్ ఆవిష్కృతం కాబోతున్నది.
ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. నేడు బ్లూబూన్ బుధవారం ఏర్పడబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్ మూన్స్ ఏర్పడుతుంటాయి.. కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్ మూన్ ఆవిష్కృతమవుతుంది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు