Saturday, November 23, 2024

AP | నేడు ఎపీపీఎస్పీ గ్రూపు-1.. పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్‌ 144 అమలు..

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఏపీపీఎస్పీ గ్రూపు-1 పరీక్షలు జరుగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనుండ‌గా.. మొత్తం లక్షా 48వేల 881మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 10గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2 గం.ల నుండి సాయంత్రం 4 గం.ల వరకు పేపర్‌-2 పరీక్ష జరుగుతుంది. గ్రూపు-1ప్రిలిమ్స్‌ పరీక్ష సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి తెలిపారు.

ఆయా పరీక్షా కేంద్రాల పరిధిలో 144వ సెక్షన్‌ కింద నిషేధాజ్ఞలు అమలు కానున్నాయి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా సజావుగా జరిగేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పిలను సిఎస్‌ ఆదేశించారు. ప్రతి పరీక్షగా కేంద్రం వద్ద ఇద్దరు పురుష, ఇద్దరు మహిళా పోలీసులతో తగిన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, పరీక్షల పర్యవేక్షణకై ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్‌ అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించినట్లు తెలిపారు.

పరీక్ష అనంతరం ఆన్సర్ షీట్లు ఇతర సామాగ్రి కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. అదే విధంగా అన్ని పరీక్షా కేంద్రాల్లోను నిరంతర విద్యుత్‌ సరఫరా, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు అందుబాటు-లో ఉండేలా చూడాలని, అన్ని పరీక్షా కేంద్రాల్లో ప్రథమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్లను, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను సిఎస్‌ ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement