పొగాకు క్యూరింగ్‌లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, అధిక వ్యయాన్ని అధిగమించేందుకు నూతన సాంకేతిక అందుబాటులోకి రానున్నది. జర్మనీలోని బ్యారన్లలో యాంత్రీకరణ ద్వారా పొగాకు క్యూరింగ్ చేసే పద్ధతిని స్వయంగా పరిశీలించిన టుబాకో బోర్డు అధికారులు, ఏపీలోని ఆ తరహా విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
అమరావతి, ఆంధ్రప్రభ: ఐటీసీ భాగస్వామ్యంతో బ్యారన్లలో మల్టీ పర్పస్ యూనిట్లను ఏర్పాటు-చేయటం ద్వారా పొగాకు క్యూరింగ్ లో యాంత్రీకరణకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు పొగాకు పండించే జిల్లాల్లో బ్యారన్లను నిర్మించి క్యూరింగ్ చేపట్టనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని గోపాలపురం, యర్నగూడెంలలో బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న యంత్రాలతో కూడిన బ్యారన్లను నిర్మించి ప్రయోగాత్మకంగా క్యూరింగ్ మొదలు పెట్టారు. ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు అధికంగా పండించే అన్ని జిల్లాల్లో బ్యారన్లలో మల్టీ పర్సప్ యూనిట్లు నెలకొల్పాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.
ఒకొక్క మల్టీపర్పస్ యూనిట్ వ్యయం సుమారు 9 లక్షలు కాగా.. ఐటీసీ రూ 3 లక్షలు, టు-బాకో బోర్డు రూ 3 లక్షలు..రైతుల వాటాగా మరో రూ 3 లక్షలు కలిపి యూనిట్ల నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పొగాకు క్యూరింగ్ కోసం అధిక పెట్టు-బడిని భరించాల్సి రావటంతో పాటు- కూలీల కొరత కూడా రైతులను వేధిస్తోంది. మల్టీ పర్సప్ యూనిట్ల వల్ల కూలీల కొరత నుంచి శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. జర్మనీలోని లూజ్ లీఫ్ బ్యారన్లలో అమలు చేస్తున్న క్యూరింగ్ విధానాన్నే యధాతధంగా అమలుపరిచేలా బ్యారన్లలో మల్టీ పర్సప్ యూనిట్లను నెలకొల్పనున్నారు.
ఇతర పంటలకూ ఉపయోగం..
ఐటీ-సీ భాగస్వామ్యంతో ఇప్పటికే గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో 14 యూనిట్లను నెలకొల్పగా చిట్యాలో 4 యూనిట్ల నిర్మాణం కొనసాగుతుం ది. వీటిని పొగాకు క్యూరింగ్‌కు మాత్రమే కాకుండా మల్టీపర్పస్ యూనిట్లు-గా వినియోగి స్తున్నారు. సంప్రదాయ సాధారణ పద్ధతిలో బ్యారన్ల వద్దకు పొగాకును తీసుకువచ్చి కర్ర లకు అల్లి బ్యారన్ లో క్యూరింగ్ చేస్తుంటారు. ఈ విధానానికి స్వస్తిపలికి యాంత్రీకరణ పద్దతులను అవలంబించటం వల్ల క్యూరింగ్ వ్యయం 50 శాతం మేర తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు.
మల్టీ పర్పస్ యూనిట్లుగా ఉపయోగపడటంతో కొబ్బరి, మొక్కజొన్న, అల్లం, పసుపు పంటలను డ్రై చేసేందుకు కూడా ఇవి ఉపయోగ పడుతున్నాయి. సమయం కూడా ఎంతో ఆదా అవుతుంది..యాంత్రీకరణ పద్ధతుల్లో డ్రై చేసిన పంటను ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో మార్కెట్ లో గిట్టుబాటు ధరలు వచ్చే వరకు ఎదురుచూసే సౌలభ్యం కలుగుతుందని రైతులు అంటున్నారు. వ్యవసాయంలో ప్రభుత్వం యాంత్రీకరణను ప్రోత్సహిస్తుండటంతో యూ నిట్ ఖరీదులో కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు రాయితీలు, సబ్సిడీలు కూడా అందుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పొగాకు పండే అన్ని ప్రాంతాల్లో మల్టీ పర్పస్ యూనిట్లను నెలకొల్పితే ఒక్కొక్క రైతుకు బ్యారన్ కు సుమారు లక్ష రూపాయల పెట్టుబడి తగ్గిపోయే అవకాశం ఉందని అంచనా.