Tuesday, December 3, 2024

Tirupati – వరద ప్రవాహంలో ఇద్దరు గల్లంతు

తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని మల్లాం సమీపంలో ఉన్న తాగేటమ్మ ఆలయం వద్ద వరద నీటి ప్రవాహంలో ఇద్దరు గల్లంతైన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది.

ఫెంగల్ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో చిట్టమూరు మండల పరిధిలోని రొయ్యలకాలువలో వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తుంది.‌

అధికారులు ఆ మార్గంలో రాకపోకలను నిలుపుదల చేశారు. మంగళవారం కొత్తగుంట నుంచి మల్లాంకు మోటర్ సైకిల్లో వెలుతున్న ఇద్దరు వరద ప్రవాహాన్ని లెక్కచేయకుండా దాటడంతో వరద ఉధృతిలో కొట్టుకు పోయారు.

సమాచారం అందుకున్న అధికారుల‌ బృందం సంఘటన స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గలంతైన వారికోసం గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గలంతైన వారిలో నెల్లూరుకు చెందిన మధు, ఒరిస్సాకు చెందిన‌ షారుఖ్ గా అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement