క్షతగాత్రులకు మంత్రుల పరామర్శ…
మృతులకు నష్టపరిహారం ప్రకటన
ఒక్కొక్కరికి రూ.25 లక్షల అందజేత
క్షతగాత్రులకూ ఆర్ధిక సాయం
అందరికీ ఉచితంగా వైద్య చికిత్స
తిరుపతి – తిరుపతిలో నిన్న క్యూలైన్‌లో తొక్కిసలాట జరిగిన ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను ఏపీ మంత్రులు పరామర్శించారు. రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి జిల్లా ఇన్చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ , సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు హరిప్రసాద్, జాయింట్ కలెక్టర్ తో కలసి రుయా ఆసుపత్రి మార్చురి నందు ఉన్న మృతులను పరిశీలించి వారి కుటుంబాలను ఓదార్చివివరాలు తెలుసుకున్నారు.
అనంతరం మీడియా తో మంత్రులు మాట్లాడుతూ తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సి సి కెమెరా లు ఉన్నాయని వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని, ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని మంత్రులు తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, మృతులు తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృతదేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామాలకు చేర్చడం జరుగుతుందన్నారు.
మృతులకు నష్టపరిహారం ప్రకటన
ఒక్కొక్కరికి రూ.25 లక్షల అందజేత
క్షతగాత్రులకూ ఆర్ధిక సాయం
అందరికీ ఉచితంగా వైద్య చికిత్స
తిరుపతిలో గత రాత్రి జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మరణించిన ప్రతి ఒక్కరికీ రూ.25లక్షలు అందజేయనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి కూడా తగిన నష్టపరిహారం అందజేస్తామన్నారు. గాయపడిన ప్రతి ఒక్కొరికీ వారు కోలుకునే వరకూ ప్రభుత్వమే వారి హాస్పిటల్ ఖర్చులు భరిస్తుందని, అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.
క్షతగాత్రులను పరామర్శించిన టీటీడీ ఈవో
తిరుపతిలోని పద్మావతి వైద్య కళాశాలలో చికిత్సపొందుతున్న వారిని టీటీడీ ఈవో శ్యామలరావు పరామర్శించారు వద్దకు వెళ్లి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల నుంచి సమాచారం సేకరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోవడం 41 మందికి గాయాలపాలు కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. డీఎస్పీ గేట్లు తెరవడం వల్లే ఘటన జరిగిందని ప్రాథమికంగా తేలిందని వెల్లడించారు. పూర్తి విచారణ తరువాత అన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.
మరణించిన వారు వీరే…
తిరుమల తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన ఆరుగురి వివరాలు అధికారులు ప్రకటించారు.. ఇప్పటికే వారి బంధువులకు సమాచారం అందించారు.. మృతదేహాలను రుయా హస్పటల్ లోని మార్చురీలో భద్రపరిచారు.. వారి బంధువులు వచ్చిన తర్వాత ప్రభుత్వం వాహనాలలో వారి స్వస్థలాలకు మృతదేహాలను పంపే ఏర్పాటు చేశారు అధికారులు.
1) లావణ్య స్వాతి(37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం
2) శాంతి (35) కంచరపాలెం, విశాఖపట్నం
3) రజని (47), మద్దెలపాలెం, విశాఖపట్నం
4) బాబు నాయుడు(51), రామచంద్రపురం, నరసరావుపేట
5) మల్లిగ(50), మేచారి గ్రామం. సేలం జిల్లా, తమిళనాడు
6) నిర్మల (45), పొల్లాచ్చి, తమిళనాడు