Wednesday, January 29, 2025

Tirupati | ఆరు జిల్లాల్లో  సోలార్ విద్యుత్ ఉత్పత్తి  – ఎస్పీడీసీఎల్ సి ఎం డి సంతోష రావు

తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయాలసీమ ) : తిరుపతి కేంద్రంగా పని చేసే తమ సంస్థ  పరిధిలోని 6 జిల్లాల్లో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద 7, 454 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఎస్పీడీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోష రావు వెల్లడించారు.

ఈరోజు డిస్కం పరిధిలో జరిగిన  గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా  జాతీయపతాకావిష్కరణ చేసిన ఆయన మాట్లాడుతూ  సంతోష రావు సంస్థ ప్రగతి ప్రణాళికలను వివరించారు . ప్రస్తుతం సంస్థ పరిధిలో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఇప్పటివరకు 2,049 సర్వీసులకు సంబంధించి పనులు పూర్తయ్యాయని, తద్వారా  7,454 కిలోవాట్ల సోలార్ విద్యుత్తు ఉత్పత్తి అవుతోందని తెలిపారు. తిరుపతి సర్కిల్ పరిధిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం  నారావారిపల్లెలో ప్రయోగాత్మకంగా 25 సర్వీసులకు రూప్టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయని తెలిపారు 

- Advertisement -

 నారావారిపల్లెతోపాటు రంగంపేట, చిన్న రామాపురం, కందుల వారిపల్లె పంచాయితీల్లో 2,330 సర్వీసులకుగానూ సోలార్ ఫీజబిలిటీ వున్న 2050 సర్వీసులకు సోలార్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించినట్టు తెలిపారు. అలాగే  చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలో నడిమారు గ్రామంలోని 103 సర్వీసులకు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను రూపొందిస్తున్నామని తెలిపారు.

ఇందులో భాగంగా 50,312 గృహాలకు 6,503 ఎస్సీ విద్యుత్తు వినియోగదారులకు, 986 ఎస్టీ విద్యుత్తు వినియోగదారులకు, 755 ప్రభుత్వ భవనాలపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ఎపిఎస్ పిడిసిఎల్ పరిధిలో మొట్టమొదటిసారిగా సబ్-స్టేషన్లకు బ్యాటరీతో కూడిన, బ్యాటరీ లేకుండా ఫోర్ ఇన్ వన్ డిసి సిస్టమ్ ఏర్పాటు చేసి, దానికి పేటెంటుకు దరఖాస్తు చేశామన్నారు. అలాగే ఎల్సి మెకానిజమ్ ను కూడా అభివృద్ధి చేసి, దానికి కూడా పేటెంటుకు దరఖాస్తు చేస్తున్నట్లు తెలియజేశారు. సంస్థ పరిధిలో మొట్టమొదటిసారిగా టైమ్ బౌండ్ యాక్టివిటీస్ ను ప్రవేశపెట్టడం, సింగిల్ ఫేజ్ మీటరింగ్ క్యూబికల్స్ ఏర్పాటు చేయడం, సిటీ, హెచ్ టి స్మార్ట్ మీటర్లకు రిమోట్ పద్ధతిలో డిస్కనెక్షన్, రీకనెక్షన్ సదుపాయం ఏర్పాటు చేసి వాటికి పేటెంటును కూడా పొందినట్లు తెలిపారు.

నైట్రోజన్ బ్రేకర్ల ఏర్పాటు, రిలేస్ ఫీచర్ల ఆప్ గ్రెడేషన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. 100 కెవిఎ సామర్థ్యం కలిగిన ఎనర్జీ ఎఫిషియెంట్ రోబొస్ట్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను మొట్టమొదటగా తిరుపతిలోని మంగళంలో ఏర్పాటు చేశామన్నారు.అన్నిటినీమించి సంస్థ పరిధిలోని 11.95 లక్షల మంది రైతులకు పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు. వినియోగదారులు టోల్-ఫ్రీ నంబర్లు: 1912 లేదా 1800425155333కు కాల్ చేయడం ద్వారా విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

విద్యుత్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు వీలుగా సంస్థ పరిధిలో ప్రయోగాత్మకంగా తిరుపతి సర్కిల్ తో పాటు, కడప టౌన్ డివిజన్లో క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. తద్వారా వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎమ్ ద్వారా క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి విద్యుత్తు బిల్లులను సులభంగా చెల్లించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలలో సంస్థ డైరెక్టర్లు పి. అయూబ్ ఖాన్, వై. లక్ష్మీ నరసయ్య, చీఫ్ జనరల్ మేనేజర్లు జె. రమణాదేవి, డి.ఎస్. వరకుమార్, కెఆర్ఎస్ ధర్మజ్ఞాని, పి. హెచ్. జానకిరామ్, కె. ఆది శేషయ్య, ఆర్. పద్మ, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జనార్ధన్ నాయుడు, సిజిఆర్ ఎఫ్ చైర్ పర్సన్ వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి, జాయింట్ సెక్రటరీ యం. గోపాల కృష్ణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement