Tuesday, November 12, 2024

Tirupathi – ఇక ట్రాఫిక్‌ పై ఫోకస్ – ఎస్పీ సుబ్బరాయుడు సీరియస్

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కఠినంగా వ్యవహరిస్తాం.
అడ్డదిడ్డ గా పార్కింగ్ సహించం .
పుట్ పాత్ ను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అందరూ సహకరించాలి.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు వెల్లడి

ఆంధ్రప్రభ స్మార్ట్, తిరుపతి బ్యూరో : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలో ట్రాఫిక్ క్రమబద్దీకరణపై జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఫోకస్ పెట్టారు. అడ్డగోలు ఫార్కింగ్, పుట్పాత్ల ఆక్రమణపై సీరియస్ అయ్యారు. తిరుపతి నగరంలోని పూర్ణకుంభం, సెంట్రల్ పార్కు సహా పలు ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్లను అకస్మికంగా తనిఖీ చేశారు. ట్రాఫిక్ పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ప్రజలు ఎవ్వరూ రోడ్లపై రాంగ్ పార్కింగ్ చేయకూడదని, నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు పార్కింగ్ చేయాలన్నారు.

- Advertisement -

సిగ్న‌ల్ జంప్ చేయొద్దు..

ప్రతి ఒక్క వాహనదారులు వన్ వేలో రోడ్లలో ఎదురు వెళ్లకూడదని, సిగ్నల్ వద్ద సహనం పాటించి గ్రీన్ సిగ్నల్ పడినప్పుడే రోడ్డును దాటాలని వివరించారు. . సిగ్నల్ జంప్ చేసి వేరే పక్క గ్రీన్ సిగ్నల్ లోని వాహనాదారులకు ఇబ్బంది కలిగించ వద్దన్నారు. షాపులు ఎదుట గజిబిజిగా రోడ్డుకు అడ్డంగా పార్కింగ్ చేస్తే షాపుల యజమానులకు కూడా నోటీసులు ఇచ్చి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేసుకోవాలని . ఎవరైనా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ట్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

ర్యాష్ డ్రైవింగ్ చేస్తే తాటతీస్తాం..

ర్యాష్ డ్రైవింగ్, స్నేక్ డ్రైవింగ్ చేసే ఆకతాయిలపై ప్రత్యేకంగా కేసులు నమోదు చేస్తామన్నారు. రెండవసారి కూడా డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుని, జైలుకు పంపించి, డ్రైవింగ్ లైసెన్స్ ను రద్దు చేస్తామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ మొదటిసారి దొరితే జరిమానా విధిస్తామని.. రెండవసారి దొరికితే జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా పడుతుందనీ కావున మద్యం సేవించి వాహనం నడిపితే ఇకపై కఠిన తరమైన నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ముఖ్యంగా పుట్ పాత్ లను ఇష్టానుసారంగా ఆక్రమించి వ్యాపారం చేస్తూ, ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో తిరుపతి ట్రాఫిక్ డిఎస్పీ రమణ కుమార్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement