Friday, September 20, 2024

Tirupathi – పవన్ కల్యాణ్ తో తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడి భేటి

తిరుపతి ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, తిరుప‌తి : సైన్స్ డే సందర్భంగా శ్రీహరికోట‌ అంతరిక్ష కేంద్రంలో నిర్వ‌హించ‌నున్న కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా హాజ‌రుకానున్న డిప్యూటీ సీఎం పంచాయ‌తీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి కొణిదెల పవన్ కల్యాణ్​కు రేణిగుంట విమానాశ్ర‌యంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మంగళవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఇక్క‌డి నుంచి హెలికాప్ట‌ర్‌లో శ్రీ‌హ‌రికోట బ‌య‌లుదేరి వెళ్లారు.

మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన తిరుప‌తి ఎస్పీ
ఈ సందర్భంగా తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్​ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఆయ‌న‌కు పుష్ప‌గుచ్చం ఇచ్చి స్వాగ‌తం ప‌లికారు. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను కలిసినవారిలో జేసీ శుభం బన్సల్, మునిసిపల్ కమిషనర్ తిరుపతి నారపు రెడ్డి మౌర్య, ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఆర్డీఓలు నిషాంత్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్ తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement