Friday, January 10, 2025

Tirupathi – తొక్కిస‌లాట బాధితుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రామ‌ర్శ

తిరుప‌తి – తిరుప‌తిలో తొక్కిస‌లాట జ‌రిగిన ప్ర‌మాద ప్ర‌దేశాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప‌రిశీలించారు.. నేటి మ‌ధ్యాహ్నం విజ‌య‌వాడ నుంచి విమానంలో తిరుప‌తికి చేరుకున్న ఆయ‌న నేరుగా బైరాగిపట్టెడ పద్మావతీ పార్క్ వెళ్లి అక్క‌డ ఉన్న వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు.

ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు, డీఎస్పీ చెంచుబాబులతో మాట్లాడారు. భక్తులను క్యూలైన్లలోకి ఒకేసారి ఎందుకు వదిలారు? అధికారులను ప్రశ్నించారు పవన్. హైవేకు దగ్గరగా ఉండటంతో భక్తులు పద్మావతీ పార్కుకు భారీగా వచ్చారని తెలిపారు.. అనంత‌రం ఆయ‌న తిరుపతి స్విమ్స్ , రుయా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. భాదితుల క్షేమ స‌మాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.. వారిని అన్ని విధాల ఆదుకుంటామ‌ని ప‌వ‌న్ వారికి హామీ ఇచ్చారు…

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement