Monday, September 16, 2024

Tirupathi – భాకరాపేటలో కిడ్నాప్ ముఠా అరెస్టు – వెల్ల‌డించిన ఎస్పీ సుబ్బారాయుడు

ఆంధ్రప్రభ స్మార్ట్, తిరుపతి బ్యూరో : తిరుపతి జిల్లా భాకరాపేటలో వ్యక్తి కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. నకిలీ తుపాకీ చూపించి కిడ్నాప్ చేసి రూ.5 కోట్లు డిమాండు చేసిన నలుగురిని తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సోమవారం విలేకరులకు ఈ కేసు వివ‌రాల‌ను తెలిపారు. తిరుపతి జిల్లా, చిన్నగొట్టిగల్లు మండలం, చెరువు ముందరపల్లి గ్రామానికి చెందిన జంగం భాస్కర్ ను ఈ నెల 24-న ఉదయం 08:45 గంటలకు భాకరాపేట ఘాట్ రోడ్డు లో పెట్రోల్ బంకు సమీపంలో ఆటో లో వెళ్తుండగా నకిలీ తుపాకిని చూపి కిడ్నాప్ చేశారు. గొ డవ చేస్తాడనే భయంతో అతడికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసి, అక్కడక్కడ కారులో తిప్పారు.. భాదితుడి ఫోనుతో తన కుమారుడు రెడ్డి కిరణ్ కు ఫోను చేసి మొదట రూ. 5 కోట్లు డిమాండ్ చేశారు. అంత మొత్తం కుదరక పోవడంతో కోటిన్నర ఇవ్వాలని, లేదంటే జంగం భాస్కర్ ను చంపుతామని బెదిరించారు. భాదితుడి కుమారుడు రెడ్డి కిరణ్ భాకరాపేట పోలీసులకు పిర్యాదు చేశాడు.

ఇది పాత నేరగాళ్ల ముఠా..
పోలీసులకు చిక్కిన నిందితులపై బెంగుళూరు, రొంపిచెర్ల, భాకరాపేట, రాయచోటి లలో దొంగతనం, ఎర్రచందనం కేసులు ఉన్నాయి. భాదితుడిని కిడ్నాప్ చేయటానికి బాతుకోళ్ల మహమ్మద్ జీషాన్, అతని మిత్రులు మహమ్మద్ ఖాసిఫ్, ఆర్కంఖాన్ సాయం చేశారు. భాదితుడు జంగం భాస్కర్ కదలికల కొరకు అతని ఊరికి చెందిన అంజి సహకారం తీసుకున్నారు. డాక్టర్ షేక్ జాహిద్ బాషా సహకారంతో మంతు ఇంజక్షన్ ఇప్పించారు. ఈ కిడ్నాప్ కోసం వినియోగించిన వాహనం, నకిలీ తుపాకిని, మత్తు ఇంజక్షన్, భాదితుడు జంగం భాస్కర్ ఆటో ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన నిందితుల కోసం గాలింపు బృందాలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement