జగన్ కు స్పీకర్ అయ్యన్న పిలుపు
ప్రతిపక్ష హోదాపై చట్ట ప్రకారం వెళ్తా
బయట కంటే అసెంబ్లీలో మాట్లాడితే మీ మాటలకు విలువ
సమావేశాలలో పాల్గొనండి..వైసిపి ఎమ్మెల్యేకు హితవు
ఆంధ్రప్రభ స్మార్ట్ – తిరుపతి – వైసిపి అధినేత జగన్ కాని.. వైసీపీ ఎమ్మెల్యే లు కానీ.. మీడియాలో మాట్లాడటం కాదని .. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని సూచించారు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు .. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరితే సభాపతిగా తాను తప్పకుండా మాట్లాడే అవకాశం ఇస్తానన్నారు. తిరుపతి ఎస్వీ జూపార్కును నేడు సందర్శించిన స్పీకర్ , స్థానిక ఎమ్మెల్యేతో కలసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక, అసెంబ్లీ లో 80 మంది కొత్తగా ఎమ్మెల్యేలు అయ్యారని.. వారందరికీ ప్రత్యేక శిక్ష తరగతులు నిర్వహిస్తామన్నారు. రాష్టంలో పచ్చదనం పెంపొందించడానికి చర్యలు చేపడుతామని.. అపార్ట్‌మెంట్, మిద్దిల తోటల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేలా సూచనలు చేస్తాన్నారు. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయ్యాలని, .. అలాంటి వారిని ప్రశ్నించాలని సచించారు అయ్యన్న.
మొక్కలు పెంచండి..
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.. పచ్చదనాన్ని పెంపొందిస్తూ ప్రతి ఇంటా రెండు మొక్కలు నాటేలా ప్రభుత్వంప్రోత్సహించాలి అన్నారు.. పచ్చదనాన్ని పెంపొందించకపోతే మానవ మనగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు.. వాతావరణంలో ప్రకృతి వైపరీత్యాల లోపం వల్లే అనేక ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. అపార్‌మెంట్లలో కూడా చిన్నచిన్న మొక్కల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలలో నర్సరీలోని ఏర్పాటు చేసి, తద్వారా మొక్కల పెంపకాన్ని మహిళా సంఘాలకుఅప్పగిస్తూ తగిన నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి సూచిస్తాను అన్నారు స్పీకర్ .