ఇవాళ్టి నుంచి తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను నిలివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వీఐపీ బ్రేక్ సిఫార్సు లేఖల స్వీకరణను రద్దు చేసింది. రేపటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రొటోకాల్ తో వచ్చే వీఐపీలకు మాత్రమే వర్తించనున్నాయి.
- Advertisement -
సామాన్య భక్తులకు వీఐపీ బ్రేక్ టికెట్లు ఇవ్వనున్నారు. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వీఐపీ బ్రేక్ టికెట్లను ఆన్ లైన్ లో అందుబాటులోకి ఉంచనున్నారు. రోజుకు 2 వేల 500 టికెట్లను విడుదల చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇందుకు సంబంధించిన డెమో ను సైతం అధికారులు నిర్వహించారు.