Monday, November 18, 2024

Tirumala – టిటిడి పాల‌క మండ‌లి కీల‌క నిర్ణ‌యాలు ఇవే ….

తిరుమల ఆంధ్రప్రభ : శ్రీవాణి ట్ర‌స్ట్ ర‌ద్దు, శార‌ద పీఠం భూమ‌లు స్వాధీనం, అన్య‌మ‌త ఉద్యోగుల‌ను ఇత‌ర శాఖ‌ల‌కు బ‌దిలీ చేయాల‌ని టిటిడి పాల‌క మండ‌లి నిర్ణ‌యించింది.. కొత్త‌గా ఛైర్మ‌న్ గా నియ‌మితులై బిఆర్ నాయుడు నేతృత్వంలో నేడు జ‌రిగిన టిటిడి పాల‌క మండ‌లి సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను చైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు. ముఖ్యంగా తిరుమలలో రాజకీయాలు మాట్లాడటాన్ని నిషేధించినట్లు స్పష్టం తెలిపారు.
టీటీడీలో పనిచేసే అన్యమత ఉద్యోగులను ప్రభుత్వానికి బదిలీ చేయాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించారు. శ్రీవాణి ట్రస్టు పేరు రద్దు చేసి , టీటీడీ ఖాతాకు శ్రీవాణి ట్రస్ట్‌ అకౌంట్‌ అనుసందానం చేయాలని నిర్ణయించిందన్నారు. తిరుమలలో విశాఖ శారధాపీఠం లీజును రద్దు చేసి భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

సామాన్య భక్తులకు 2,3 గంటల్లో సర్వదర్శనం

సామాన్య భక్తులకు 2,3 గంటల్లో సర్వదర్శనం కలిగేలా చర్యలు తీసుకోనున్నామని వివరించారు. తిరుమలకు టూరిజం ప్యాకేజీలన్నీ రద్దు చేసి, పర్యాటక శాఖ ద్వారా ఇచ్చే దర్శన టికెట్లు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ప్రైవేటు బ్యాంకుల్లోని టీటీడీ నగదు ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదిలీ చేయనున్నట్లు చైర్మన్‌ తెలిపారు. నూతనంగా నిర్మిస్తున్న ముంతాజ్‌ హోటల్‌ అనుమతి రద్దు చేసినట్లు నాయుడు వివరించారు.
తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనానికి అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తిరుపతిలో నిర్మించిన ఫ్లై ఓవర్‌కు గరుడ వారధి పేరును పునరుద్దరించింది. తిరుమలలో అతిథి గృహాలకు సొంతపేర్లు పెట్టరాదని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు.

టిటిడి పాల‌క మండ‌లి నిర్ణ‌యాలు

ఆర్టిఫిషల్ ఇంటిలిజెంట్ సహాయంతో సామాన్య భక్తులు మూడు గంటల్లో దర్శన భాగ్యం
అన్యమత ఉద్యోగస్తులతో మాట్లాడుతాం.. విఆర్ఎస్ తీసుకుంటే విఆర్ఎస్ ఇస్తాం…. లేకుంటే ఇతర శాఖలకు బదిలీ చేస్తాం
శ్రీనివాస సేతు కు గరుడ వారధిగా పేరు మార్పు
20 ఎకరాల్లో దేవలోక్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది….
ఆ స్థలంలో ఇప్పుడు ముంతాజ్ హోటల్ కన్స్ట్రక్షన్ చేపట్టారు
ఆ ప్రభుత్వ స్థలాన్ని టీటీడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నాం
తిరుమలలో రాజకీయాలు ప్రసంగాలు నిషేధం, మాట్లాడితే కేసులు పెట్టే విధంగా చర్యలు
స్థానికులకు దర్శన భాగ్యం కల్పన…. ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యం కల్పిస్తాం
శ్రీవాణి ట్రస్ట్ రద్దు చేసి…. వేరొక ట్రస్ట్ లో విలీనం చేస్తాం
ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను గవర్నమెంట్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే విధంగా చర్యలు
నిత్య అన్నదానంను మరింత మెరుగుపరిచేలా చర్యలు…
మెనూ లో మరిన్ని ఆహార పదార్థాలు అందుబాటులో తీసుకొస్తాం
టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయం
శాశ్వత ఉద్యోగులకు 15,400 కాంట్రాక్టు ఉద్యోగులకు 7530 బ్రహ్మోత్సవ బహుమానం
శారదాపీఠంకు ఇచ్చిన స్థలాన్ని పూర్తిగా రద్దు చేసి… టీటీడీ స్వాధీనం చేసుకుంటుంది
టూరిజం టికెట్లు పూర్తిగా రద్దు…. ఇందులో భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు సమాచారం
అన్నదానం కేంద్రంలో 2 లక్షల మంది కి అన్నప్రసాదం వితరణ
అన్నప్రసాద కేంద్రంలో నూతన పరికరాలు అమర్చి…. ఆధునీకరణకు టీవీఎస్ కు ఇచ్చేందుకు నిర్ణయం
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఎలా చేయాలనే దానిపై అధ్యయనం చేస్తున్నాం
సామాన్య భక్తులకు త్వరిత గతిన శ్రీవారి దర్శనభాగ్యం కల్పించే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకురానున్నాం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్ట్యువల్ క్యూ ఏర్పాటు చేస్తాం

Advertisement

తాజా వార్తలు

Advertisement