Friday, October 18, 2024

Tirumala – శ్రీదేవి, భూదేవిలతో రథం పై తిరుమలేశుని కటాక్షం

తిరుమల క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీవారి రథోత్సవం వైభవంగా సాగింది. ఆద్యాంతం భక్తుల జయజయధ్వానాల మధ్య రథోత్సవం కొనసాగింది.

శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి రథంపై నుంచి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గోవింద నామస్మరణ చేస్తూ భక్తులు రథాన్నిలాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తిరుమలకు భారీగా చేరుకోగా.. గ్యాలరీలు కిక్కిరిశాయి..

నేటి రాత్రి అశ్వవాహన సేవ

ఇక రాత్రి మలయప్పస్వామి అశ్వవాహన సేవ ముగియనున్నది. అశ్వవాహనంపై అశ్వంపై కల్కి అవతారంలో భక్తులకు స్వామివారు అనుగ్రహించనున్నారు. ఈ అశ్వవాహన సేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

- Advertisement -

రేపు చక్రస్నానం….

రేపు చివరిఘట్టమైన చక్రస్నానంతో ఉత్సవాల పరిసమాప్తి కానున్నాయి. శనివారం దసరా పండుగ రోజున మలయప్పస్వామి, చక్రత్తాళ్వార్‌కు స్నపనతిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement