Friday, November 22, 2024

Tirumala – సూర్యప్రభ వాహనంపై శ్రీవేంకటేశ్వరుడి అనుగ్రహం

తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.

సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు. ప్రకృతికి చైతన్యప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనంపై శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు భక్తకోటికి సిద్ధిస్తాయని నమ్మకం.

రాత్రి కి చంద్ర ప్రభ వాహన సేవ

- Advertisement -

ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం మలయప్పస్వామి వారు చంద్రప్రభ వాహనంపై విహరించి భక్తకులకు అభయమివ్వనున్నారు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement