Thursday, September 19, 2024

Tirumala లడ్డు నెయ్యి వాడకం- సిబీఐ దర్యాప్తునకు షర్మిల డిమాండ్

హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు….
టీటీడీ వేదికగా టిడిపి వైసిపి రాజకీయాలు…
తిరుమల పవిత్రత ప్రతిష్ట భంగం కలిగేలా వ్యాఖ్యలు..
సెంటిమెంట్తో రాజకీయాలు చేయొద్దు..
లడ్డు నెయ్యి వాడకం అంశంలో సిబీఐ దర్యాప్తు చేయించండి..
నిజాలు నిగ్గు తేల్చాల్సిందే…
ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి

( ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో ) హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమల తిరుపతి దేవస్థానం వేదికగా వైసీపీ టీడీపీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆరోపించారు. తిరుపతి లడ్డులో వాడే నెయ్యి అంశంలో పరస్పర విరుద్ధ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిఐడితో తక్షణం దర్యాప్తు చేయించాలని ఆమె ఎక్స్ వేదికగా గురువారం డిమాండ్ చేశారు.

సిఎం హోదాలో లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారంటూ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్టకు భగం కలిగించేలా ఉన్నాయన్నారు. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మీ ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, సెంటిమెంట్ మీద రాజకీయం చేసే ఉద్దేశ్యమే మీకు లేకుంటే, నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే, తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ను ఆమె డిమాండ్ చేశారు. లేదా సి.బి.ఐ తో విచారణ జరిపించాలన్నారు. మహా పాపానికి,ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చాల్సిందే అన్నారు. మీ వ్యాఖ్యలపై కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement