తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండలంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా……ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల తెలంగాణ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడుతూ….బీసీ హాస్టల్ లో భోజన సదుపాయాలు సరిగ్గా లేదని బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటాలు ఫలించాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ చేసిన పోరాటాలకు సీఎం, మంత్రులు ఉరుకులు, పరుగులు చేయడం శుభపరిణామం అన్నారు.