Sunday, October 6, 2024

Tirumala – సీబీఎన్ మార్క్! తిరుమలలో ప్రక్షాళన షురూ… దళారుల భరతం పడుతున్న అధికారులు


కీలక వ్యవస్థల మార్పులకు శ్రీకారం
భక్తులకు సేవలపైనే దృష్టి
దళారులకు ఉక్కపోత
నిర్లక్ష్య సిబ్బందికి షోకాజ్ నోటీసులు, మెమోల జారీ
డెప్యుటేషన్బాబులువెనక్కి
చర్యల్లో ఎక్కడా తగ్గని టీటీడీ ఈవో

ఆంధ్రప్రభ స్మార్ట్, రాయలసీమ బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానాల (టి టి డి ) ప్రక్షాళన కార్యక్రమం ఊపందుకుంటోంది. టీటీడీ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు అంశాలవారీగా లోటుపాట్లను సరిదిద్దడం మొదలు పెట్టారు. తిరుమలకు వచ్చే యాత్రీకుల అవసరాలు లక్ష్యంగా పలు వ్యవస్థలలో మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో పలువురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు, మెమోలు జారీ చేయడమే కాక కొందరు డెప్యూటేషన్ అధికారులను మాతృ సంస్థకు పంపించే కార్యక్రమాన్నీ కూడా ప్రారంభించారు.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన వెంటనే తిరుమలేశుని దర్శించుకోడానికి గత నెలలో తిరుమలకు వచ్చిన చంద్రబాబు ఇక్కడినుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నట్టు ప్రకటించారు. ఆ క్రమంలోనే సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి శ్యామలరావు ను టీటీడీ కార్యనిర్వహణాధికారిగా నియమించారు. విధుల్లో చేరిన వెంటనే విస్తృతంగా పర్యటనలు మొదలు పెట్టిన శ్యామల రావు ముఖ్యమంత్రి చెప్పిన ప్రక్షాళన కార్యక్రమాన్ని మొదలు పెట్టారు.

భక్తులకు సేవలపైనే ఫోకస్

- Advertisement -

ముఖ్యంగా రద్దీ సమయాల్లో కిలోమీటర్ల కొద్దీ ఉన్న క్యూ లైన్లలో వేచి వుండే భక్తులను నామమాత్రంగా అందుతున్న అన్న ప్రసాదాలు, పాలు వంటి వాటిపై దృష్టి సారించారు. క్యూలైనులలో వేచివుండే భక్తులకు నిరంతరాయంగా నీళ్లు, పాలు, అన్న ప్రసాదాలు అందించాలని ఆదేశాలను జారీ చేశారు.అదేవిధంగా పారిశుధ్యం విషయంలో తనిఖీలు జరిపి తగు ఆదేశాలు జారీ చేసి చక్కదిద్దే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో విధినిర్వహణ కు సంబంధించి పలువురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు, మెమోలు కూడా జారీ చేశారు. దర్శనం పరమైన సమస్యలను గుర్తించిన శ్యామల రావు శ్రీవారి మెట్టు మార్గం గుండా వచ్చే వారికి దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చే ప్రక్రియను పునః ప్రారంభించారు.

డెప్యూటేషన్పై .. గరం గరం

తిరుమలలో పెచ్చుమీరిపోతున్న దళారీలపై దృష్టి సారించి టీటీడీ విజిలెన్సు, పోలీసుల సమన్వయంతో అరికట్టే చర్యలను మొదలు పెట్టారు. ఇటీవలి కాలంలో తిరుమలేశుని దివ్య ప్రసాదం లడ్డూల విషయంలో వస్తున్న నాణ్యతా పరమైన అంశాలను చక్కదిద్దడానికి అటు వస్తువులను సరఫరా చేసే వ్యాపారులతో, ఇటు లడ్డూలను తయారు చేసే బ్రాహ్మణులతో సమావేశాలు నిర్వహించి లోపాలను సరిద్దిద్దడం ప్రారంభించారు. అన్నిటినిమించి ప్రభుత్వం నుంచి టీటీడీ కి డెప్యూటేషన్ పై వచ్చిన అధికారుల పనితీరు పై దృష్టి ని సారించిన శ్యామల రావు అవసరాన్ని బట్టి కొనసాగించాలా వద్దా అనే అంశంపై చర్యలు మొదలు పెట్టారు.

తాజాగా తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా ) వైస్ చైర్మన్ గా పని చేస్తూ కొన్ని నెలల కిందటే టీటీడీకి డెప్యూటేషన్ పై వచ్చిన హరికృష్ణ ను వెనక్కు పంపించివేశారు. మరి కొందరిని కూడా పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంమీద పలు కారణాలవల్ల గత కొంతకాలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవస్థలను, విభాగాలను చక్కదిద్దడం ద్వారా చంద్రబాబు నిర్దేశకత్వంలో టీ టీ డి ప్రక్షాళన ఊపందుకుంది.

దళారీలకు ముక్కు తాడు

తిరుమలలో దళారుల ఆటకట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. టీటీడీ విభాగం నుంచి గదులు పొంది అక్రమాలకు పాల్పడిన వారిపై నిఘా పెంచారు.దళారుల అక్రమాలపై 2019 నుంచి ఇప్పటివరకూ 279 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లోని నిందుతుల వివరాలను ప్రకటించారు. నకిలీ ఆధార్‌లతో గదులు, సేవా టికెట్లు పొందిన 589 మందిని గుర్తించారు. వీరిలో 208 మందిని అరెస్ట్ చేశారు. మిగిలిన 381 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు సమర్పించిన నకిలీ ఆధార్ కార్డుల ఆధారంగా పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.

కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిఘా పెట్టారు. చిన్న తప్పు దొరికినా వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో చాలా అక్రమాలు, అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. దీంతో వారందరిపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement