Thursday, September 19, 2024

Tirumala ముగ్గురు ఎర్ర చందనం దొంగలు అరెస్టు

తిరుమల పాపనాశనం సమీపంలోని నిషేధిత అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి 10 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాలు మేరకు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ శ్రీనివాస్ ఆద్వర్యంలో ఆర్ ఐ (ఆపరేషన్స్) సురేష్ కుమార్ రెడ్డి కి చెందిన ఆర్ ఎస్ ఐ టీ. విష్ణు వర్ధన్ కుమార్ టీమ్ సోమవారం తిరుమల చేరుకుని, అక్కడ నుంచి వేద పాఠశాల మీదుగా పాపనాశనం వైపు వెళుతుండగా, అక్కడ నిషేధిత అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు.

వారిని హెచ్చరించి చుట్టుముట్టే ప్రయత్నం చేయగా వారు దుంగలు పడేసి పారిపోయారు. అయితే టాస్క్ ఫోర్స్ టీమ్ వారిని వెంబడించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ప్రాంతంలో 10ఎర్రచందనం దుంగలు లభించాయి. వారిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా జమునామత్తూరుకు చెందిన వారుగా గుర్తించారు. వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేయగా ఎస్ ఐ రఫీ విచారిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement