Friday, September 20, 2024

Tirumala – అది మహాపాపం – అయిదేండ్లలో అప‌చారం జ‌రిగింది : రమణ దీక్షితులు

నేను అప్ప‌ట్లోనే పోరాటం చేశాను
తోటి అర్చ‌కుల స‌హ‌కారం లేదు
తిరుమల లడ్డూ వివాదంపై రమణ దీక్షితులు ఆవేదన

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, తిరుమ‌ల‌: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుడి ప్రసాదాల్లో కల్తీ జరగడం విచారమని అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూల నాణ్యత సరిగ్గా లేదని గతంలోనే అప్పటి చైర్మన్, ఈవో దృష్టికి తీసుకెళ్లానని రమణ దీక్షితులు తెలిపారు. ప్రసాదాల పరిమాణాలు కూడా సరిగ్గా లేవని ఫిర్యాదు చేశానని అన్నారు. కానీ, తన తోటి అర్చకుల సహకారం అందించకపోవడంతో.. తనది ఒంటరి పోరాటం అయ్యిందని అన్నారు. దీంతో తన పోరాటానికి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. దీనివల్ల అయిదేండ్ల‌పాటు మహాపాపం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అది అనుకోకుండా బ‌య‌ట‌ప‌డింది..

- Advertisement -

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలను ప్రక్షాళన చేస్తానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారని ర‌మ‌ణ‌దీక్షితులు గుర్తు చేశారు. దానికి తగ్గట్టుగానే చర్యలు తీసుకున్నారని అన్నారు. అయితే.. లడ్డూలో తయారీలో కల్తీ జరగడం అనేది అనుకోకుండా బయటపడిందని అన్నారు. దీనికి కూడా పరిహారంగా కర్నాటక డెయిరీ నుంచి నందిని నెయ్యిని తిరిగి తీసుకొచ్చి స్వామివారికి ప్రసాదాలు తయారు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని అన్నారు. ఈ సందర్భంగానే ఏపీ సీఎం చంద్రబాబుకు రమణ దీక్షితులు మరో రిక్వెస్ట్ చేశారు.స్వామివారి మీద విపరీతమైన భక్తి, ఆగమ శాస్త్రాల మీద, మన సంప్రదాయాల మీద గౌరవం ఉన్న వారికి తిరుమలలో సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement