తిరుమలలో భక్తులు కిక్కిరిపోయారు. రెండు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులు భారీగా తరలివస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల కొండకు చేరుకుంటున్నారు.రాజకీయ సినీ ప్రముఖులు సైతం శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు. దీంతో దర్శన క్యూ లైన్లన్నీ నిండిపోతున్నాయి. ప్రత్యేక దర్శనం క్యూలైన్లలోనూ భక్తులు బారులు తీరుతున్నారు.
సర్వదర్శనం టికెట్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటలు పడుతోంది. కాగా, తిరుమల పద్మావతి పరిణయోత్సవాలు రెండోరోజుకు చేరుకున్నాయి.. ఇవాళ గరుడ వాహనంపై ఉరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకోనున్నారు శ్రీవారు.. ఈ నేపథ్యంలో.. ఇవాళ ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది.. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి.. వెలుపల క్యూ లైనులో పెద్ద సంఖ్యల్లో వేచిఉన్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.. మరోవైపు.. నిన్న శ్రీవారిని 71,510 మంది భక్తులు దర్శించుకున్నారు.. 43,199 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.. హుండీ ఆదాయం రూ.3.63 కోట్లుగా పేర్కొంది టీటీడీ.