Sunday, November 24, 2024

Tirumala – సుప్రీం కోర్టులో తిరుపతి లడ్డూ

సమగ్ర విచారణ జ‌రిపించాలి
టీటీడీ మాజీ చైర్మన్ అభ్యర్థన
సీఎం చంద్రబాబు కామెంట్లపై బీజేపీ నేత పిటిషన్
ఆధారాలు చూప‌కుండా ఆరోప‌ణ‌లు చేశార‌న్న సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి

ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూఢిల్లీ : తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం సుప్రీంకోర్టు గడప తొక్కింది. ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఇప్పుడు తాజాగా ఈ వివాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని వైసీపీ, బీజేపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని అభ్యర్థించారు. లేదంటే నిపుణులతో విచారణ చేయాలని కోరారు. తిరుమల వెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్‌పై విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను బీజేపీ లీడర్‌ సుబ్రమణ్యస్వామి వేశారు. ఎలాంటి ఆధారాలు చూపించకుండానే సీఎంగా ఉన్న చంద్రబాబు ఆరోపణలు చేసారని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని సుబ్రమణ్య స్వామి కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement