Tuesday, September 17, 2024

Tirumala – ఆ వార్త‌లు అబ‌ద్దం … ల‌డ్డూ ప్ర‌సాదం విక్ర‌యాల‌లో మార్పులు లేవు

తిరుమ‌ల – ఒకసారి లడ్డూలు తీసుకుంటే తిరిగి నెల రోజుల తర్వాతే మళ్లీ లడ్డూలను తీసుకునేందుకు అవకాశం ఉంటుందని.. దళారులను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అదనపు ఈవో వెంకయ్య చౌదరి పేరుతో వ‌చ్చిన వార్త‌పైఊ టిటిడి దీనిపై వివరణ ఇచ్చింది. తిరుమ‌ల‌లో లడ్డూ విక్రయ విధానాల్లో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. దర్శనం చేసుకున్న తర్వాత భక్తులకు ఇచ్చే ఉచిత లడ్డూతో పాటు నాలుగు నుంచి ఆరు లడ్డూల వరకు విక్రయిస్తామని చెప్పింది. దర్శనం టికెట్లు, టోకెన్లు లేని భక్తులకు మాత్రమే ఆధార్‌ కార్డు నమోదుతో రెండు లడ్డూలు విక్రయిస్తామని క్లారిటీ ఇచ్చింది. నెలకు ఒకసారి మాత్రమే లడ్డూలు అన్నది నిజం కాదని.. అదనపు లడ్డూలను ప్రతిరోజూ తీసుకోవచ్చని తెలిపింది.

టికెట్స్‌, టోకెన్స్‌ లేకుండానే కొంతమంది లడ్డూలను కొనుగోలు చేస్తున్నారని.. వాటిని బయట బ్లాక్‌లో అధిక ధరలకు అమ్ముతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అందుకే టోకెన్లు లేని వారికి ఆధార్‌ నిబంధన పెట్టామని చెప్పారు. దళారీలను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement