తిరుమల – తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారినిఏపీ బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం విఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండలంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా……ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల బీసీ సంక్షేమ శాఖమంత్రి సవిత మీడియాతో మాట్లాడురూ, దర్శన సమయంలో భక్తులతో మాటామంతి నిర్వహించామని అన్నారు. భక్తుల టీటీడీ అందిస్తున్న సదుపాయాలు చాలా బాగున్నాయని తెలిపారన్నారు.
తిరుమలలోని లేపాక్షి ఎంపోరియం ను సందర్శించానని…. గత మూడు నెలలుగా లేపాక్షిలో విక్రయాలు పెరిగాయన్నారు. హస్త కళలకు పెద్దపీట ఈ పేదల ప్రభుత్వం వేస్తోందని చెప్పారు. త్వరలో మరికొన్ని లేపాక్షి ఎంపోరియం ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
సేల్స్ పెంచి చేతన, హస్త కళాకారులకు అండగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు. చేనేత, హస్తకళలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తో రివ్యూ మీటింగ్ జరగనుందని…. మార్కెటింగ్, పనిముట్లు, ఇతర సదుపాయాలపై కేంద్ర మంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ట్రెండ్ తగ్గట్టుగా చేనేత కార్మికులకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తామని అన్నారు.