తిరుమల తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం స్వామి వారి సేవలో పాల్గొన్న పలువురు ప్రముఖులు
వైకుంఠ ద్వార దర్శన భాగ్యం కోసం దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తిరుమలకు క్యూకట్టారు. రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక రంగాల్లో పేరున్న ప్రముఖులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం 4.30 గంటల నుంచి దర్శించుకున్నారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించారు.
శుక్రవారం వేకువజాము నుంచి భక్తులను దర్శనానికి టీటీడీ అధికారులు అనుమతించారు. ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకుంటున్నారు. వైకుంఠ ద్వారా దర్శనం కోసం ప్రముఖులకు సుమారు 5 వేల టికెట్లను మంజూరు చేశారు.
లఘు దర్శనంలో ప్రముఖులకు స్వామి వారి దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం ప్రోటోకాల్ దర్శనంలో ఆధ్యాత్మిక గురువు బాబా రాందేవ్., హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయా, తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్., డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క., తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్., తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ,పట్నం మహేందర్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలంగాణ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ ఎమ్మెల్యే గడ్డం వినోద్, తెలంగాణ మాజీ మంత్రి మల్లా రెడ్డి,తెలంగాణ మాజీ మంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ మాజీ మంత్రి సునీత లక్ష్మ రెడ్డి,సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు,హోం మినిస్టర్ అనిత, రాష్ట్రమంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్రమంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర మంత్రి సవిత, రాష్ట్ర మంత్రి సంధ్యారాణి, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎంపీ సీఎం రమేష్, ఎంపీ డీకే అరుణ, ఎంపీ ఆర్.కృష్ణయ్య,బండ్ల గణేష్, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, సినీ నటుడు సప్తగిరి, చాముండేశ్వరి నాథ్, బ్యాట్మెంటన్ పుల్లెల గోపీచంద్, వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు