తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి ఇవాళ ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నేడు నిర్వహించారు.. గత 18 ఏళ్లుగా శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది.
.ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని బంగారువాకిలి చెంత భోగ శ్రీనివాసమూర్తికి అర్చకస్వాములు ఏకాంతంగా సహస్ర కలశాభిషేకం జరిపారు . .
చారిత్రక నేపథ్యం : పల్లవ రాణి సామవాయి పెరుందేవి క్రీ.శ 614వ సంవత్సరంలో జ్యేష్ఠ మాసంలో 18 అంగుళాల పొడవుగల వెండి భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని తిరుమల శ్రీవారి ఆలయానికి కానుకగా సమర్పించారు. ఇందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఆలయంలో శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి సహస్రకలశాభిషేకం నిర్వహిస్తారు.
.
సర్వదర్శనానికి 36 గంటలు ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైనులో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతోంది.
శనివారం హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు నిన్న(శనివారం) శ్రీవారిని 82,886 మంది భక్తులు దర్శించుకున్నారు. 44, 234 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు వచ్చింది.