Friday, November 22, 2024

రథసప్తమికి ముస్తాబైన తిరుమల గిరులు.. సప్తవాహనాలపై ఊరేగనున్న మలయప్పస్వామి

తిరుమల ప్రభన్యూస్‌ ప్రతినిధి: తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం రథసప్తమి పర్వదినం సందర్భంగా మాడవీధుల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు. సప్తవాహనాల పై స్వామివారి వైభవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనుండడంతో అందుకుతగ్గట్లు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా స్వామివారి వాహన సేవలు భక్తులు తిలకించేందుకు వీలుగా గ్యాలరీల్లో చలువ పందిళ్ళు, గ్యాలరీల్లోకి భక్తులు వెళ్ళేందుకు మార్గాలను, భక్తులు ఇబ్బందులు పడకుండా తిరిగి వెళ్ళేందుకు గేట్‌లను ఏర్పాటు చేశారు.

శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున కైంకర్యాలు పూర్తిఅయిన తర్వాత ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు వాహన మండపానికి వేంచేపు చేస్తారు. ఇందుకోసం ముందుగా అన్ని ఏర్పాటు చేసిన టిటిడి ఇంజనీరింగ్‌ అధికారులు. అదేవిధంగా గ్యాలరీల్లో వేచివున్న భక్తులకు ఎప్పటికప్పుడు తాగునీరు, టీ, కాఫి, పాలు, అన్నప్రసాదాలు అందించేందుకు వీలుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. రథసప్తమి పర్వదినం కారణంగా ఆ రోజు శ్రీవారి ఆలయంలో నిర్వహించే అర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement