Monday, November 18, 2024

Tirumala – నెయ్యి కల్తీపై సిట్ దర్యాప్తు ప్రారంభం

తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తామని సిట్‌ చీఫ్‌ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు సిట్‌కు బదిలీ అయిందని చెప్పారు..

కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు ‘సిట్‌’ విచారణ సాగుతోంది. తిరుపతి పోలీసు అతిథి గృహంలో నేడు మరోసారి సిట్‌ సభ్యులు భేటీ అయ్యారు. మూడు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ , నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ డెయిరీపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. సిట్‌ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నారని వివరించారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదని తెలిపారు

టి టి డి ప్రొక్యూర్‌మెంట్‌ జీఎం ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను సిట్‌ బృందం పరిశీలిస్తోంది. డీఐజీ గోపీనాథ్‌ జెట్టీ, ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు, అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు

- Advertisement -

టి టీ ద్ బోర్డు దగ్గర నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. నేడు ఈవో శ్యామలరావును వారు కలవననున్నారు. ఆయన్ను అడిగి పూర్తి వివరాలు తెలుసుకోనున్నారు.

కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్‌ సభ్యులు పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. దుండిగల్‌లో ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ సంస్థను పరిశీలించనున్నారు. తమిళనాడుకూ వెళ్లనున్నారు.

తిరుమలలో లడ్డూపోటు, విక్రయ కేంద్రాలను మరో బృందం పరిశీలించనుంది. లడ్డూ తయారీ ముడి సరుకులపై ఆరా తీయనున్నారు. తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను ప్రశ్నించనున్నారు.

టి టి డీ పరిపాలన భవనంలో మరో బృందం విచారణ చేపట్టనుంది. నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు పరిశీలించనుంది. దీనికి సంబంధించి టి టి డీ, ఏఆర్‌ డెయిరీ మధ్య ఒప్పందాలపై ఆరా తీయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement