Friday, January 10, 2025

Tirumala – తప్పు జరిగింది – న్యాయ విచారణలో అన్ని నిజాలు తెలుస్తాయి – టిటిడి చైర్మన్

తిరుమల – తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో టీటీడీ పాలకమండలి నేడు అత్యవసర సమావేశం నిర్వహించింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశమైన పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

సీఎం చంద్రబాబు ఆదేశించిన అనుసారం అత్యవసర పాలకమండలి సమావేశం నిర్వహించినట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. సీఎం ఇచ్చిన ఆదేశాలను పాలకమండలిలో చర్చించి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. మృతులపట్ల పాలకమండలి తీవ్ర సంతాపం తెలిపిందన్నారు.’

మృతుల కుటుంబాలకు ఒక్కొకరికి 25 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు.. గాయపడ్డ వారికి 2 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల చదువును టీటీడీ భరిస్తుంది. టీటీడీ స్వయంగా వెళ్లి నష్టపరిహారాన్ని అందిస్తుంది. జ్యూడిషల్ విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. చనిపోయిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తూ’ నిర్ణయాలు తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ ప్రకటించారు.’.

ఉద్దేశ పూర్వకంగా జరిగిన సంఘటన కాదు.. ఏర్పాట్లు సరిగ్గా లేని ఒకటి రెండు చోట్ల ఘటన చోటు చేసుకుంది. ఈ ఏడాది 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తాం. రెండు రోజుల నిర్వహణపై ఆగాక సలహా మండలి సలహా మేరకు నిర్ణయం తీసుకుంటాం. దర్శనకు వెళ్లాలంటేనే టోకెన్స్ కావాలి అని మాత్రమే చెప్పాం.. తిరుమలకు భక్తులను అనుమతిస్తాం అని వెల్లడించాం.

- Advertisement -

తప్పు జరిగింది.. క్షమాపణ చెప్తే చనిపోయిన భక్తులు తిరిగిరారు కదా? జ్యూడీషియల్ ఎంక్వయిరీలో అన్ని వివరాలు భయటకి వస్తాయి.. జ్యూడీషియల్ ఎంక్వయిరీలో అన్ని వివరాలు భయటకి వస్తాయి’ అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement