Friday, November 22, 2024

Tirumala – డిసెంబర్ నెల దర్శన కోటా రిలీజ్…

ఆన్ లైన్ లో అందుబాటులో టికెట్స్ …
వివిద సేవ‌ల కోటా రిలీజ్ తేదీలు విడుద‌ల
షెడ్యూల్ రిలీజ్ చేసిన టిటిడి ..

తిరుమ‌ల – శ్రీవారి భక్తుల సౌకర్యార్ధం టీటీడీ ముందుగానే పలు సేవలకు , దర్శనానికి సంబందించిన టికెట్స్ ను ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తుంది. అదే విధంగా డిసెంబర్ నెల కోటాకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను నేడు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

ల‌క్కీ డిప్ ద్వారా ఈ సేవా టిక్కెట్లు..

- Advertisement -

భక్తులు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఈ సేవాటికెట్లను అందిచ‌నున్నారు.. ఈ సేవా రిజ‌ర్వేష‌న్ ల‌ను నేడు ఆన్ లైన్ లో ఉంచారు… ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో భక్తులు తమ తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఎలక్రానిక్ డిప్ లో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు వరకూ సేవకు సంబంధించిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు లక్కీడిప్‌లో పొందిన టికెట్లు మంజూరు చేస్తారు టిటిడీ అధికారులు.

పలు సేవలు, వర్చువల్ కోటా వివరాలు

డిసెంబరు నెలకు సంబంధించిన శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా విడుదలతో పాటు.. వర్చువల్ సేవల దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆన్ లైన్ లో రిలీజ్ చేయనున్నారు.

అంగప్రదక్షిణం టోకెన్లు, వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

ఈ నెల‌ 23న ఉదయం 10 గంటలకు డిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఇదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ కాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, గదుల కోటా

డిసెంబరు నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో గదుల కేటాయింపు కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది.

సెప్టెంబరు 27న శ్రీవారి సేవ కోటా విడుదల

సెప్టెంబరు 27వ తేదీన శ్రీవారి సేవకు సంబంధించిన కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు టీటీడీ ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement