Wednesday, December 4, 2024

Tirumala – స్థానికులకు దర్శన టోకెన్లు జారీ

తిరుమల – ఆంధ్రప్రభ – తొలి టీటీడీ బోర్డు సమావేశంలో స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని తీర్మానం చేసిన మేరకు సోమవారం తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులుతో కలిసి తిరుమల స్థానికులకు దర్శన టోకెన్ల జారీని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరించేందుకు తొలి బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శ్రీవేంకటేశ్వరుని దర్శనం చేసుకునే అవకాశం కల్పించడం పట్ల స్థానికులు ఎనలేని సంతోషాన్ని వ్యక్తం చేశారని అన్నారు. అనంతరం అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమల, తిరుపతి రూరల్, అర్బన్, రేణిగుంట, చంద్రగిరి స్థానికులకు దర్శన కోటా ఖరారు చేసేందుకు టీటీడీ అధికారులు తీవ్ర కసరత్తు చేశారన్నారు. సామాన్య భక్తులు, ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాకు ఎలాంటి అంతరాయం కలగకుండా స్థానికుల దర్శన కోటా పునరుద్ధరించామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement