Monday, November 11, 2024

Tirumala ల‌డ్డూ త‌యారీ పై స‌మ‌గ్ర నివేదిక ఇవ్వండి … టిటిడి ఈవోకి చంద్ర‌బాబు ఆదేశం

ఈ వివాదంపై నేడు చంద్ర‌బాబు సమీక్ష‌
తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడుతాం
ఈ కుంభ‌కోణంలో పెద్ద‌లున్నా జైలుకే

అమరావతి: లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈ రోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని టిటిడి ఈవోను ముఖ్యమంత్రి చంద్ర‌బాబు ఆదేశించారు. శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వినియోగించిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అత్యంత పవిత్రమైన తిరుమలలో జరిగిన ఈ అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆందోళనలు, భక్తుల ఆవేదనల నేప‌థ్యంలో . గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్ధ సారధితో పాటు ఉన్నతాధికారులతో తిరుమల అంశంపై సీఎం సమీక్షించారు.

తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని సీఎం ప్రకటించారు. భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని చంద్రబాబు అన్నారు. ఈ తిరుమ‌ల ప‌విత్ర ను కాపాడే విష‌యంలో రాజీ ప‌డ‌బోమ‌ని తేల్చ చెప్పారు.. ఈ కుంభ‌కోణంలో ఎంత‌టి పెద్ద‌లున్నా వ‌దిలి పెట్టే స‌మ‌స్య లేద‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు..

- Advertisement -

చంద్రబాబుతో కేంద్రమంత్రి నడ్డా..

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆరా తీశారు. ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని కోరారు.

జ‌గ‌న్ పై కేంద్ర మంత్రులు గ‌రం గ‌రం

తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ వివాదం వేళ కార్మిక శాఖ సహాయ మంత్రి శోభాకరంద్లాజే ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. ”తిరుమలకు చెందిన కళాశాలల్లో పద్మావతీ శ్రీనివాసుల ఫొటోలను తొలగించాలని, హిందూయేతర గుర్తులను సప్తగిరులపై ఏర్పాటు చేయాలని జగన్‌ అండ్‌ కో చూసింది. హిందువులు కానివారిని బోర్డ్‌ ఛైర్మన్‌గా నియమించింది. జంతువుల కొవ్వులను పవిత్ర ప్రసాదంలో కలిపింది. వెంకటేశ్వరస్వామీ.. మా చుట్టూ జరుగుతున్న ఈ హిందూ వ్యతిరేక రాజకీయాలకు మమ్మల్ని క్షమించు” అని ఘాటుగా ఎక్స్‌లో పోస్టు చేశారు.

స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌పండి – ప్ర‌హ్లాద్ జోషి

లడ్డూలో కల్తీ ఆరోపణలపై దర్యాప్తు అవసరమని కేంద్ర ఆహారశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. ”ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైంది. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి.. దోషులుగా తేలిన వారిని శిక్షించాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement