కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శనివారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మంటపంలో అర్చకులు కుమారస్వామి దంపతులకు వేదాశీర్వాదం అందించారు. అధికారు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తనకు పెద్ద బాధ్యత అప్పగించారన్నారు. కేంద్రమంత్రిగా అందులో తాను విజయవంతం కావాలని ఆ వెంకటేశ్వర స్వామివారిని వేడుకున్నట్లు చెప్పారు.
- Advertisement -