తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజైన ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్ప స్వామి దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో స్వర్ణరథంపై ఊరేగుతూ భక్తులకు అభయం ఇచ్చారు. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తజనం తరలివచ్చారు. భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీనివాసుడి వాహన సేవ కన్నులపండువగా జరిగింది.
ఇక రాత్రి 7 నుంచి 7 గంటల మధ్య శ్రీవారికి అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 6 నుంచి 9 మంధ్య ఉత్సవాల ముగింపుగా శ్రీవారి పుష్కరిణిలో చక్ర స్నానం నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ ఇప్పటికే పూర్తిచేసింది.