తిరుమలలో వైభవంగా చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు శనివారం పుష్కరిణిలో అర్చకులు ఈ క్రతువును పూర్తిచేశారు. అనంతరం భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఆలయంలో 8 రోజులుగా మలయప్పస్వామికి వివిధ వాహన సేవలు నిర్వహించారు. శ్రీవారు వివిధ అవతారాల్లో భక్తులకు అభయమిచ్చారు. విజయదశమి నేపథ్యంలో ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.