Monday, October 7, 2024

Tirumala brahmotsavas – రేపే దేవదేవుడి గరుడ సేవ

ఆంధ్రప్రభ స్మార్ట్, తిరుమల: సప్తగిరిధీశుడు శ్రీవేంకటేశ్వర స్వామి గరుడ సేవకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమల కొండపైకి పెద్ద సంఖ్యలో వాహనాలు రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. స్వామి గరుఢ సేవకు ఏపీఎస్ ఆర్టీసీ 400కి పైగా బస్సులు ఏర్పాటు చేసిందని 3 వేల ట్రిప్పులు తిరుగుతాయన్నారు.

“గరుడ సేవకు వచ్చే భక్తుల భద్రతకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. 1200 మంది తిరుమల తిరుపతి విజిలెన్స్ సిబ్బంది విదుల్లో ఉంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పోలీసు విభాగం నుంచి 3,800 మంది విధుల్లో ఉన్నారు. వారిలో 1,500 మంది గరుడ సేవ కోసం పని చేస్తున్నారని వివరించారు..

తిరుమలలోని ప్రధాన కూడళ్లలో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమాడ వీధుల్లో భక్తులకు ఇబ్బంది లేకుండా భక్తులంతా సంతృప్తిగా గరుడసేవ వీక్షించేలా ఏర్పాట్లు చేశామని, వేలా మంది దర్శించుకునేలా క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు.

- Advertisement -

గురుడ సేవకు దాదాపు 3.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశామని, ప్రధాన కూడళ్లలో అన్నప్రసాదం అందుబాటులో ఉంటుందన్నారు. భక్తులను గందరగోళానికి గురిచేసే విదంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement